Kanna Lakshmi Narayana: కాపుల సామాజిక ఆర్థిక సర్వే కోసం వైఎస్ చర్యలు చేపడితే, చంద్రబాబు ఈబీసీ కోటాలో రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే కాపులని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని కన్నా విమర్శించారు. కాపు రిజర్వేషన్ల డిమాండ్ సుదీర్ఘ కాలంనుంచి ఉందని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. కాపులకి రిజర్వేషన్లు ఇవ్వాలని తాను కూడా కోరుకుంటున్నానని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.
అయితే కాపులకి రాజకీయ దిశా నిర్దేశం చేసే శక్తి తనకి లేదని ఆయన చెప్పారు.జనసేన పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ కు తెలుసన్నారు.జనసేనను ఏర్పాటు చేసి 9 ఏళ్లు అవుతుందన్నారు. పార్టీ ఎలా నడపాలో పవన్ కళ్యాణ్ కు తెలుసునని ఆయన చెప్పారు.కన్నా లక్మీనారాయణ గత కొంతకాలంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో విబేధిస్తున్నారు. ఈ మేరకు తన అసంతృప్తిని బహిరింగంగానే వ్యక్తం చేసారు.
తాను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నపుడు ఎంతో మందిని పార్టీలోమ జాయిన్ చేసానని వారందరూ ఇపుడు పార్టీని ఎందుకు వీడుతున్నారో చెప్పాలంటూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసారు. కోర్ కమిటి లో చర్చ జరగకుండానే జిల్లా అధ్యక్షులను మార్చారని ఆయన ఆరోపించారు. అధ్యక్షుల మార్పు తనతో చర్చించలేదన్నారు. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా తాను నియమించిన వాళ్లేనని కన్నా అన్నారు.ఎంపీ జివిఎల్ ఆలోచన స్థానిక బిజేపి కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుందన్నారు. అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవిఎల్ వైఖరి చూశామని కన్నా పేర్కొన్నారు. జగన్ – కేసిఆర్ కుట్రలో బాగంగానే బీఆర్ఎస్ లోకి ఏపీ నేతలు వెడుతున్నారని కన్నా తెలిపారు. ఏపిలో పవన్ , తెలంగాణ లో బండి సంజయ్ ను బలహీనపరచడానికి కుట్రలు జరుగుతున్నాయన్న కన్నా జగన్ , కేసిఆర్ లు కలసి ఈ కుట్ర చేస్తున్నారని అన్నారు.
జగన్‌ది పాలన కాదని.. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని కన్నా మండిపడ్డారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏ రాజకీయ నేతను బతకనీయరని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పక్షాలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఏపీలోని కాపు నేతలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని అన్నారు. పవన్‌కు తామంతా అండగా ఉంటామని చెప్పారు. అంతేకాదుజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని, జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే అన్నారు.. సోము ఒక్కడే అన్ని చూసుకోవడం వల్లే ఈ పరిస్ధితి దాపరించిందని.. పార్టీలో ఏం జరుగుతుందో తమకు కూడా తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు.