Site icon Prime9

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు

Pinnelli

Pinnelli

Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం పగలకొట్టిన కేసు లో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుంది .నాలుగు పోలీస్ బృందాలు పిన్నెల్లి కోసం గాలిస్తన్నాయి .ఏపీ లోనే కాదు తెలంగాణలో కూడా పిన్నెల్లి కోసం విస్తృతంగా పోలీసులు గాలిస్తున్నారు .ఇప్పటికే పిన్నెల్లికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసారు .పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు .మరో వైపు దీనికి సంబంధించి పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు .పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం పీవో ను సస్పెండ్ చేసారు .పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సమయంలో ఘటనా స్థలంలోనే ఉన్న పీవో, ఇతర సిబ్బంది పిన్నెల్లిని అడ్డుకోకపోవడంతో సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు . సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది .

ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేట కోర్టులో లోంగిపోతాడని సమాచారం. పిన్నెల్లి కోర్టులో లొంగిపోతాడన్న సమాచారం లీక్ కావడంతో నరసరావుపేటలో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా పోలీసులతో పాటు నరసరావుపేటలో కూడా పోలీసులు అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే పిన్నెల్లి కోర్టులో లొంగిపోతాడన్న సమాచారాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించడంలేదు. అయితే పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

చలో మాచర్ల భగ్నం..(Pinnelli Ramakrishna Reddy)

మరో వైపు మాచర్ల లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బాధితులను పరామర్శించడానికి టీడీపీ గురువారం ‘చలో మాచర్ల’కు పిలుపునిచ్చింది .మాచర్ల లో 144 సెక్షన్ అమలులో ఉండడంతో పోలీసులు టీడీపీ నేతలను అనుమతించలేదు .మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గుంటూరులో నక్కా ఆనంద్, కనపర్తి శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసుల మోహరించారు. పోలింగ్ మరుసటి రోజు నుంచి జూలకంటిని గృహనిర్బంధం చేశారు. గొల్లపూడిలో దేవినేని ఉమను, విజయవాడలో వర్ల రామయ్యను హౌస్ అరెస్ట్ చేశారు.

Exit mobile version