Platform 65 Restaurant : భారతదేశంలోని టాయ్-ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ అయిన ప్లాట్ఫామ్ 65 తన అన్ని అవుట్లెట్లెలో గణేష్ చతుర్థి ప్రత్యేకమైన వేడుక నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. అదే సమయంలో తన సామాజిక బాధ్యతను నెర వేర్చడానికి నడుం బిగించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వాటి కంటే ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను ప్రోత్సహిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వాటిలో హానికర రసాయనాలు, విషపూరిత రంగులు ఉంటాయి. నిమజ్జనం తరువాత అవి నీటిలో ఉండే జీవులకు హాని కలిగిస్తాయి. జల వనరులు కాలుష్యానికి దారితీస్తాయి.
ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పర్యావరణ అనుకూల పద్ధతులను అనుసరిస్తూ.. తన వినియోగదారులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ప్లాట్ ఫాం 65 రెస్టారెంట్ సెప్టెంబర్ 18న తన రెస్టారెంట్లలో 300లకు పైగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను బహుమతిగా ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఆ సంస్థ కార్పొరేట్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ బండారు పర్యవేక్షించారు. కస్టమర్లకు ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాలు అందజేసే కార్యక్రమంపై (Platform 65 Restaurant) ప్లాట్ ఫాం 65 మేనేజింగ్ డైరెక్టర్, వ్యవస్థాపకులు శ్రీ సద్గుణ్ పాథా మాట్లాడుతూ.. “పర్యావరణ పరిరక్షణకు ఫ్లాట్ ఫాం 65 కట్టుబడి ఉంది. దీనిలో భాగంగానే ఈ వినాయక చతుర్ధికి ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాలను అందిస్తున్నాము. ఇలా చేయడం ద్వారా మనవంతుగా పర్యవరణానికి మేలు చేసిన వాళ్లం అవుతాం. ఈ వినాయక చవితికి రుచికరమైన వంటకాలను అందించడమే కాదు, రాబోయే తరాలకు మన పర్యా వరణాన్ని పరిరక్షించే బాధ్యతను ఇలా చేయడం ద్వారా అందిస్తున్నామని అన్నారు.
అలానే ప్లాట్ఫామ్ 65 (Platform 65 Restaurant) వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ గోపిశెట్టి మాట్లాడుతూ.. “గణేష్ చతుర్థిని వేడుకలను బాధ్యతతో చేసుకోవాల్సి అవసరం ఉంది. కులమతాలకు అతీతంగా చాలా ప్రాంతాల్లో ఈ వినాయక చవితిని జరుపుకుంటారు. ప్లాట్ఫామ్ 65 కూడా తన బాధ్యతను గుర్తు పెట్టుకుని పర్యావరణ వినాయక విగ్రహాలను అందిస్తుంది. ఇలాంటి గొప్పొ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఆనందంగా ఉందని అన్నారు.