TSPSC Office: గురుకులాల్లో పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు గురువారం టీఎస్పీఎస్సి కార్యాలయాన్నిముట్టడించారు. టీఎస్పీఎస్సి కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అభ్యర్ధుల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనితో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు, అభ్యర్ధులకు మధ్య తోపులాట జరగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మహిళా అభ్యర్థులను అబిడ్స్ ఏసీపీ పూర్ణచందర్ రావు దుర్భాషలాడారు.
ఆరేళ్లయినా భర్తీ చేయలేదు..(TSPSC Office)
2017 వ సంవత్సరంలో ఫలితాలు ప్రకటించినా ఇప్పటివరకూ పోస్టులు భర్తీ చేయకుండా ఆలస్యం చేస్తున్నారని వారు మండిపడ్డారు. వెంటనే పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని వారు డిమాండ్ చేసారు. ఈ నేపధ్యంలో అధికారులతో చర్చించేందుకు ఐదుగురు అభ్యర్దులను పోలీసులు అనుమతించారు.