CM Jagan: కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా గతంలో పాలకులు చేయనివిధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ -200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీఎం జగన్ ప్రారంభించారు. అదేవిధంగా రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసారు.
దేశానికే ఆదర్శంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్..( CM Jagan)
ఈ సందర్బంగా పలాసలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఉద్దానం ప్రజల బాధలను పాదయాత్రలో తెలుసుకున్నానని అన్నారు. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేశాము.ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాము.అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.85 కోట్లతో నిర్మాణాలు చేపట్టాము.ఉద్దానం ప్రాంతంలో సురక్షిత మంచినీరు కోసం రూ.700 కోట్లతో హిరమండలం రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా మంచినీటిని అందిస్తున్నాము. అత్యున్నత ప్రమాణాలతో వైద్య చికిత్స అందించేలా కిడ్నీ రీసెర్చి సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వచ్చాయి. ఫిభ్రవరిలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ కూడా జరిగేలా చూడాలని హెల్త్ సెక్రటరీ తో చెప్పాను.పలాసలో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. 42 మంది వైద్యులు, 152 మంది పారా మెడికల్ సిబ్బంది తో కలిసి 375 మంది సేవలందించేందుకు అందుబాటులో ఉన్నారు. పరిసర మండలాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాము. వీరిలో కిడ్నీ వ్యాధుల లక్షణాలు బపటడిని వారికి కూడా ట్రీట్ మెంట్ ప్రారంభించాము. ఈ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో సెమీ ఆటోమెటిక్ అనలైజర్లను అందుబాటులో ఉంచామని సీఎం జగన్ చెప్పారు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులను పెన్షన్ రూ.10 వేలకు పెంచామని, నాన్ డయాలసిస్ రోగులకు కూడా రూ.5 వేల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలి.టీడీపీ హయాంలోనూ ఉద్దానంలో ఇదే సమస్య ఉంది.కానీ పరిష్కారం మాత్రం మీ జగన్ ప్రభుత్వంలోనే లభించింది.చంద్రబాబు హయాంలో చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదు.ప్రజలకు చంద్రబాబు చేసిన ఒక్క మంచి పని కూడా లేదు.తెలంగాణలో పుట్టనందుకు బాధపడుతున్నానని పవన్ అంటున్నారు.ఈ నాన్‌లోకల్ ప్యాకేజీ స్టార్ చంద్రబాబుకు దత్తపుత్రుడు.ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని పవన్ తెలంగాణలో మాట్లాడుతున్నారు. తెలంగాణలో తన అభ్యర్దులను పోటీలో ఉంచితే మన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. డిపాజిట్లు పోయాయి. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు.ఉత్తరాంధ్రలో 4 బిల్డింగ్‌లు కట్టినా ఏడుస్తారు.సీఎంగా విశాఖలోనే ఉంటానన్నా ఏడుస్తారని జగన్ మండిపడ్డారు.