Site icon Prime9

CM KCR: ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసిన వాళ్లకు ఓటెయ్యాలి.. సీఎం కేసీఆర్

CM KCR

CM KCR

CM KCR: పూటకో పార్టీలు, మాటలు మార్చే వాళ్లను నమ్మొద్దని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసిన వాళ్లకు ఓటెయ్యాలని సీఎం కేసీఆర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. పాలేరు చైతన్యవంతమైన గడ్డ. పాలేరులో కొన్ని నరం లేని నాలుకలు మనల్ని విమర్శిస్తున్నాయి. మాట మార్చినా.. సత్యం మారదు..కళ్ల ముందే కనిపిస్తుందని కేసీఆర్ అన్నారు. తండాలను పంచాయతీలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రైతుబంధు అనే పదం పుట్టించిందే నేను.రైతుబంధును వ్యవసాయ నిపుణులు, ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.రైతుబంధుతో రైతులు గొప్పగా పంటలు పండిస్తున్నారు.రైతుబంధు కూడా ఎకరానికి రూ.16 వేలకు పెంచుతున్నాం.వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే 2వ స్థానానికి ఎదిగాం.సీతారామ ప్రాజెక్టు పూర్తయితే పాలేరు వైపు కరువు కన్నెత్తి చూడదని అన్నారు.

కాంగ్రెస్ నేతలకు డబ్బు మదం..(CM KCR)

ఖమ్మం జిల్లాలో కొందరు కాంగ్రెస్ నేతలకు డబ్బు మదం పట్టిందని కేసీఆర్ ఆరోపించారు.బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వం అంటున్నారు.ప్రజలంతా తలుచుకుంటే దుమ్ము లేవదా?
తుమ్మల నాగేశ్వరరావుకు అన్యాయం చేశామని ప్రచారం చేస్తున్నారు.తుమ్మల ఖమ్మంలో ఓడి ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రి పదవి ఇచ్చాం. పాలేరులో ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించుకున్నాం. ఐదేళ్ల పాటు ఖమ్మం జిల్లా పెత్తనం ఇస్తే ఆయన చేసింది ఏం లేదు. జిల్లాలో పార్టీకి ఒక్క సీటు రాకుండా చేసారు. బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? తుమ్మల బీఆర్ఎస్ కు అన్యాయం చేసారా? ఇదంతా కళ్లముందు కనిపిస్తోంది. అయితే ఇపుడు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి వారికి ప్రజలు బుద్ది చెప్పాలి. రూ.200 ఉన్న ఆసరా పింఛన్లు రూ.2 వేలకు పెంచాము. ఆసరా పింఛన్లు ఇప్పుడు రూ.3వేలకు, ఆ తర్వాత రూ.5 వేలకు పెంచుతాం. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే 2వ స్థానానికి ఎదిగాం. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ అంటున్నాడు.3 గంటల కరెంట్ చాలని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారు.రైతులకు ఏమీ ఇవ్వొద్దు.. పంచుకొని తినాలని కాంగ్రెస్ నాయకుల ఆలోచన. కాంగ్రెస్ వస్తే రైతుబంధు, దళిత బంధు ఉండవు. ఉపేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఇంకా అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.

 

Exit mobile version