Madapur Drug Case: హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో 8మంది నిందితులని పోలీసులు రిమాండుకి తరలించారు. వీరిని ఈ నెల 13న అరెస్ట్ చేశారు. మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ముగ్గురు నైజీరియా దేశస్తులని అదుపులోకి తీసుకున్నాం పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
హీరో నవదీప్‌కు ఊరట ..(Madapur Drug Case)
నైజీరియన్లు నుంచి ఎండిఎంఎ డ్రగ్స్‌తోపాటు ఎక్స్టసీ పిల్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో హీరో నవదీప్‌కు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయని నిర్ధారించుకున్నామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. హీరో నవదీప్‌తోపాటు మరో 17 మంది పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో తరచూ డ్రగ్స్ పార్టీ నిర్వహించేవారని పోలీసులు తెలిపారు. రామ్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాదులో డ్రగ్స్ పార్టీలు చేశారని విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. A5 నుంచి A16 వరకు నిందితులపై ఎన్ డి పి ఎస్ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్లకింద కేసు నమోదు చేశామని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.మరోవైపు డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు ఊరట లభించింది. నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదని నవదీప్ కోర్టుకెళ్లారు.