Site icon Prime9

Chegondi Harirama Jogaiah: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అదిరిపోయింది.. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య

chegondi-harirama-jogaiah

chegondi-harirama-jogaiah

Chegondi Harirama Jogaiah: తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమయిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అదిరిపోయిందని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. బస్సు యాత్ర మొదలయి, పూర్తయే నాటికి జనసేన గ్రాఫ్ మరింత పెరిగి ఒంటరిగా ఎన్నికలలో ప్రయాణం చేసినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని తాను ఎప్పుడో చెప్పానని జోగయ్య గుర్తు చేశారు.

పవన్ కళ్యాణ్‌ని ఆరాధిస్తున్నారని అర్థమవుతోంది..(Chegondi Harirama Jogaiah)

కత్తిపూడిలో మొదలయి రెండవ రోజున పిఠాపురం వచ్చే సరికి జనం సంఖ్య పెరిగిందని జోగయ్య అన్నారు. వారాహి యాత్రలో పాల్గొన్న యువకులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల ప్రజల స్పందన చూస్తే పవన్ కళ్యాణ్‌ని ఏవిధంగా ఆరాధిస్తున్నారో అర్థమైపోతుందని జోగయ్య వివరించారు., గతంలోను, ప్రస్తుతం పరిపాలన సాగించిన, సాగిస్తున్న ప్రభుత్వాల మార్పును ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో తెలిసిపోతుందని జోగయ్య అన్నారు.

సీఎం పై అవినీతి ముద్రవేయడంలో సక్సెస్ ..

ఈ రెండు రోజుల ప్రయాణంలో తానే కాబోయే ముఖ్యమంత్రినని ఒకటికి రెండుసార్లు ప్రకటించుకోవటం కూడా మంచి పరిణామమని జోగయ్య తెలిపారు. 10 సంవత్సరాలు అధికారం ఇవ్వాలని అడగటం ద్వారా కూటమిలో సిఎం అయ్యేది ఎవరన్న సందేహానికి తెరదీసినట్టైందని జోగయ్య చెప్పారు. సిఎం జగన్‌పై ఎక్కు పెట్టిన అవినీతి ఆరోపణలు ముఖ్యమంత్రిపై పర్మినెంట్ అవినీతి చక్రవర్తిగా ముద్ర వేయటంలో పవన్ కళ్యాణ్ సఫలీకృతం అయ్యారనే చెప్పాలని జోగయ్య అన్నారు.

పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి తాను ఏమాత్రం వ్యతిరేకం కాదని పవన్ కళ్యాణ్ ప్రకటించారని జోగయ్య గుర్తు చేశారు. 5 సంవత్సరాలలో 500 మంది యువకులకు ప్రతి నియోజకవర్గంలో వ్యాపారం లేక పరిశ్రమ పెట్టుకోవడానికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయిలు ఉచితంగా తమ ప్రభుత్వం ఇస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడం కూడా శుభ పరిణామమని జోగయ్య అన్నారు. నిరుద్యోగ యువకుల ఉపాధికోసం జనసేన ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ ప్రకటనతో అర్థమైపోయిందని జోగయ్య తెలిపారు.ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలతోపాటు నియోజకవర్గ జన సైనికులను, వీర మహిళలను, మేధావులను, రైతులను, చేతి వృత్తుల వార్లను, సాధారణ ప్రజలను స్వయంగా కలిసి, వారి నుండి వివిధ సమస్యలను తెలుసుకుంటున్నారని జోగయ్య అన్నారు. ఆ సమస్యలకి తమ ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందని భరోసా ఇచ్చే జనవాణి కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ ప్రజలకి మరింత దగ్గరయ్యే అవకాశం కల్పిస్తుందని జోగయ్య ప్రశంసించారు.

Exit mobile version