పవన్ కళ్యాణ్: వైసీపీ ఓడిపోతోంది.. అధికారం జనసేనదే.. వ్యూహం నాకొదిలేయండి

జనసేన అధికారంలోకి వస్తుంది.. ఆ వ్యూహం నా దగ్గర ఉంది అంటూ పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి కౌలు రైతు భరోసా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Updated On - December 18, 2022 / 04:18 PM IST

Pawan Kalyan: జనసేన అధికారంలోకి వస్తుంది.. ఆ వ్యూహం నా దగ్గర ఉంది అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆదివారం సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ మార్పు కావాలంటే పోరాటం చేవలసిందేనని అన్నారు. నన్ను నమ్మండి.. జనసేనను అధికారంలోకి తీసుకొస్తానంటూ భరోసా ఇచ్చారు. మీకోసం రక్తమైనా చిందిస్తా.. జైల్లో అయినా కూర్చుంటా. అధికారంలో కూర్చోవాలంటే బాధ్యతగా పనిచేయాలని అన్నారు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో కొట్టే కొద్దీ పైకి లేస్తానే తప్ప కిందపడనంటూ పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కాపు కులాన్ని అడ్డం పెట్టుకుని నాయకులు ఎదుగుతున్నారు కాపులు ఎదగట్లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారం చూడని కులాలను అధికార పీఠం ఎక్కించడమే జనసేన లక్ష్యం ఉన్నత వర్గాల్లో పేదరికం ఉంది. వారికి అండగా ఉండాలని అన్నారు. నేను ఎక్కడికీ పారిపోను.. ఇదే నా అడ్రస్.. తప్పు చేస్తే నా చొక్కా పట్టుకోండి.. మాటిస్తున్నా..బెదిరించే నాయకులు ఉంటే ఎదిరించే యువత ఉండాలి. కణకణలాడే నిప్పు కణాలు మీరు.. మీకు జనసేన ఉంది.నేను పిలుపు ఇచ్చిన రోజున చేతులు కట్టుకుని వెళ్లిపోండి.. ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తానంటూ పవన్ పేర్కొన్నారు.

నాకు ఎవరిపైనా ప్రేమ లేదు.. ద్వేషం లేదు.. నాకు కావాల్సింది రిజల్ట్. ఎవరితోనైనా విబేధిస్తా.పని చేయకపోతే నిలదీయండి.. నన్నైనా సరే. చాలా పారదర్శకంగా అన్నీ చేసి చూపిస్తా.. సీఎం అవ్వాలని నేను అనుకుంటే అవ్వదు.. మీరు కోరుకుంటే అవుతుందినేను భుజం కాసేవాడినే.. మీ భుజం మీద ఎక్కనునేను సొంతంగా 30 కోట్లే ఇవ్వగలను.. అధికారం ఇస్తే అవినీతి రహిత పాలన లక్షల కోట్లు ఇస్తా అంటూ పవన్ హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం రాకపోతే ఏపీ అంధకారమే.వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. కారణం ఇదే.బీజేపీకి, టీడీపీకి అమ్ముడుపోవాల్సిన ఖర్మ నాకు లేదు.మీలాగా నీచుడిని కాదు.. పెన్షన్ డబ్బులు, ఇన్స్యూరెన్స్ డబ్బులు దొబ్బేయను అంటూ వైసీపీ నేతలపై పవన్ మండిపడ్డారు.