Patnam Mahender Reddy: తెలంగాణ మంత్రి వర్గంలోకి పట్నం మహేందర్ రెడ్డి చేరారు. గవర్నర్ తమిళి సై మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో సిఎం కెసిఆర్ సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు, గవర్నర్‌కు మంత్రి మహేందర్ రెడ్డి పుష్పగుచ్ఛాలు ఇచ్చారు.
రెండోసారి మంత్రిగా..( Patnam Mahender Reddy)
మహేందర్‌రెడ్డి రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 వరకు మంత్రిగా కొనసాగారు.కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో తాండూరులో ఓటమి చవిచూశారు. తాండూరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి తరువాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్దుల ప్రకటన సందర్బంగా సీఎం కేసీఆర్ రోహిత్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. దీనితో అసంతృప్తి చెందిన మహేందర్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి. దీనితో మహేందర్ రెడ్డిని క్యాబినెట్లో చేర్చుకున్నట్లు తెలుస్తోంది.