Site icon Prime9

Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasa Rao

Palla Srinivasa Rao

Palla Srinivasa Rao: తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడిగా తనను ప్రకటించడంతో శుక్రవారం పల్లా శ్రీనివాసరావు చంద్రబాబును కలిశారు.ఈ సందర్భంగా పల్లాకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌పై భారీ మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో పల్లా గెలుపొందారు. ఈ నేపథ్యంలో బీసీ-పైగా యాదవ వర్గానికి చెందిన పల్లాను చంద్రబాబు ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు వ్యవహరించిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టడంతో టీడీపీ అధ్యక్షునిగా వేరే వారిని నియమించాలని చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావును నియమించడంతో టీడీపీ కేడర్ అభినందనలు చెబుతున్నారు.

పీఆర్పీ తో రాజకీయ ఆరంగ్రేటం..(Palla Srinivasa Rao)

తండ్రి పల్లా సింహాచలం వారసుడిగా రాజకీయ రంగంలోకి వచ్చాడు శ్రీనివాసరావు .2009 లో ప్రజారాజ్యం తరుపున విశాఖ ఎంపీగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు .ఆ ఎన్నికల్లో ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పై పోటీ చేసారు .ఆమె కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు .తదనంతరం టిడిపిలో చేరిన పల్లా శ్రీనివాసరావు 2014 లో టిడిపీ తరుపున గాజువాక నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి విజయం సాధించారు .2019 లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయడంతో ఓటమి చవిచూశారు .మరలా 2024 లో కూటమి అబ్యర్థిగా బరిలోకి దిగారు .జనసేన ఓట్లు పూర్తిగా బదిలీ కావడంతో ఏపీలోనే అత్యధిక మెజారిటీ సాధించారు .

Exit mobile version