Site icon Prime9

Visakhapatnam Traffic police: విశాఖలో ట్రాఫిక్ పోలీసుల రశీదుపై అన్యమత కీర్తనలు

traffic police

traffic police

Visakhapatnam: విశాఖపట్నంలో ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన రశీదుపై అన్యమత కీర్తనలు ఉండటం కలకలం రేపింది. విశాఖ రైల్వే స్టేషన్‌లో ట్రాఫిక్ పోలీసు నిర్వహించే ప్రీపెయిడ్ ఆటోస్టాండ్‌లో ఇచ్చే ప్రయాణికులకు ఇచ్చే టోకెన్లపై ఒక మతానికి సంబంధించిన కీర్తనలు ముద్రించి ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు విశాఖ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారుఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడికి వెళ్లి ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే దీనిపై విశాఖ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. పోలీసు సిబ్బంది నిర్వహించే ప్రీపెయిడ్ ఆటోస్టాండ్‌లో ప్రయాణికులకు ఇచ్చే టోకెన్లు శుక్రవారం అయిపోవడంతో గమనించకుండా పొరపాటున వేరే టోకెన్లు ఇవ్వడం జరిగింది. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అది గమనించకుండాలనే ప్రయాణికులకు టోకెన్లు ఇచ్చారని పోలీసు శాఖ తెలిపింది.

అదే సమయంలో వచ్చిన తిరుమల ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు కూడా వాటిని ఇచ్చారని పేర్కొంది. అయితే ఇది పొరపాటున మాత్రమే జరిగిన పని అని.. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే సిబ్బంది ఆ టోకెన్ల పంపిణీ ఆపివేసినట్టుగా తెలిపింది. ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా కూడా విశాఖ పోలీసు శాఖ వివరణ ఇచ్చింది.

Exit mobile version