Site icon Prime9

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత

Nagarjuna Sagar Dam

Nagarjuna Sagar Dam

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. డ్యాంపై ఇరు రాష్ట్రాల పోలీస్ బలగాలు మోహరించాయి. డ్యామ్ 13వ గేటు వద్ద ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు జేసిబిలను సిద్దం చేశారు. ఇరు రాష్ట్రాల పోలీస్ బలగాలు మోహరింపుతో డ్యామ్ పై ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇక కాసేపట్లో తెలంగాణా ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టును సందర్శించనున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించడంతో.. ప్రాజెక్ట్ పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. మరోవైపు రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి అక్కడే మకాం వేశారు.

ఏపీ పోలీసులపై కేసు నమోదు..( Nagarjuna Sagar Dam)

ఏపీ పోలీసులపై నాగార్జున సాగర్ లోని విజయ పురి పోలీసులు కేసు నమోదు చేశారు. సాగర్ వివాదంతో పోలీసులు దుందుడుగా వ్యవహరించారని ఆరోపిస్తూ.. ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రివర్ బోర్డ్ అధికారులు చేరుకున్నారు. మరోవైపు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు సాగర్ డ్యామ్ ను సందర్శించారు. పరిస్థితిని పరిశీలించిన తెలంగాణ అధికారులు.. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇంకోవైపు సాగర్ ఉద్రిక్తతలపై కేంద్రం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సాగర్ డ్యామ్ ను పరిశీలించిన రివర్ మేనేజ్ మెంట్ బోర్ట్ అధికారులు కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాం పై పోలీస్ పహారా కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలు పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్దంగా ఇప్పటికే 2 వేల క్యూసెక్కుల నీరు ఏపీకి దౌర్జన్యంగా విడుదల చేసారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 522 అడుగుల చేరువలో ఉంది.మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరోజికి చేరే అవకాశం ఉంది.

Exit mobile version