Site icon Prime9

Singareni Elections: కొనసాగుతున్న సింగరేణి ట్రేడ్ యూనియన్ ఎన్నికల పోలింగ్

Singareni elections

Singareni elections

 Singareni Elections: ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో ట్రేడ్ యూనియన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

ఎన్నికల విధుల్లో 650 మంది ఉద్యోగులు..( Singareni Elections)

సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు.మొత్తం 39 వేల 748 మంది కార్మికులు సింగరేణి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 650 మంది ఉద్యోగులు పోలింగ్, కౌంటింగ్ విధులు నిర్వర్తించనున్నారు.

ఏడవసారి జరుగుతున్న ఎన్నికలు..

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఐదుగురు పోలీసుల చొప్పున కేటాయించారు. ఎన్నికలు పూర్తైన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంల్లో కౌంటింగ్ జరుగుతుంది. సింగరేణి ఎన్నికల్లో రామగుండం, బెల్లంపల్లి రీజియన్లు కీలకంగా మారాయి. ఈ రెండు రీజియన్లలో భారీగా ఓటర్లు ఉన్నారు. రామగుండంలోని మూడు రీజియన్ల పరిధిలో 12 వేల 824 ఓటర్లుండగా… బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలో 14 వేల 960 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు రీజియన్ల పరిధిలోనే 27 వేల 784 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఇప్పటివరకు ఆరుసార్లు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఏడోసారి పోలింగ్ జరగబోతోంది. గత ఎన్నికల్లో 16 యూనియన్లు పోటీ చేయగా.. ఈసారి 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. గత రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌… సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘం.. TBGKS ను రెండుసార్లు గెలిపించుకుంది.

ఈ సారి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తమ అనుబంధ కార్మిక సంఘం అయిన INTUC గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. 2003లో ఒక్కసారి మాత్రమే INTUC విజయం సాధించింది. మూడుస్లారు AITUC, రెండుసార్లు TBGKS గెలుపొందింది. 2019లోనే సింగరేణి యూనియన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంతో ఆ సమయంలో ఎన్నికలు ఆలస్యమైంది. సింగరేణి సంస్ధలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం పార్టీల అనుబంధ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల వేడి పెరిగింది.

తెలంగాణలో కొనసాగుతున్న సింగరేణి ఎన్నికల పోలింగ్.. గెలుపెవరిది..? | Singareni Elections | Prime9 News

Exit mobile version
Skip to toolbar