Site icon Prime9

CM Jagan: మిచౌంగ్ తుఫాన్‌పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్

CM Jagan

CM Jagan

 CM Jagan: మిచౌంగ్ తుపాను తుపాను దృష్ట్యా ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు.కోతకి వచ్చిన ఖరీఫ్ పంటని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన టాస్కని సీఎం జగన్ అన్నారు.

ఆహారం, మందులు అందుబాటులో..( CM Jagan)

సహాయక శిబిరాల్లో తాగునీరు, ఆహారం, అవసరమైన మందులు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు మరియు రవాణా సౌకర్యాలను పునరుద్ధరించడంతో పాటు, సరైన పారిశుధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆయన అన్నారు.మనుషులు మరియు జంతువులకు ప్రాణనష్టం జరగకుండా అధికారులు ప్రాథమిక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. ముఖ్యంగా ఖరీఫ్‌ కోతలు, వరి సేకరణ సమయంలో పంటల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.ధాన్యంలో తేమ శాతం పై అధికారులు దృష్టి సారించాలని జగన్ అన్నారు.తుపానులో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.2,500, బాధితులకు రూ.1,000 ఆర్థిక సాయం అందించాలన్నారు. అంతే కాకుండా తుపాను బాధితులకు 25 కిలోల బియ్యం, పప్పులు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళదుంపలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తుఫానుకు ప్రభావితమైన గడ్డితో ఉన్న ఇళ్లు/గుడిసెలకు రూ. 10,000 ఆర్థిక సహాయం అందించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో తుపాను తగ్గుముఖం పట్టిన తర్వాత అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖను వైఎస్‌ జగన్‌ కోరారు.

తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ ఎనిమిది జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తుపాను హెచ్చరికలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రికి తెలియజేశారు. తుఫాను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బాపట్ల సమీపంలో తీరాన్ని తాకే అవకాశం  ఉందన్నారు. డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్న సమయంలో 90-100 కి.మీ గరిష్టంగా గంటకు 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని జిల్లా కలెక్టర్లు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar