Site icon Prime9

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు లో ప్రభాకర రావు కు నాన్ బెయిల్ వారెంట్!

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏ1గా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు. ఓ ఛానల్ యజమానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. నాంపల్లి కొర్టులో రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియ కొనసాగుతుంది. సమాచారం ధ్వంసం చేయడంలో ప్రభాకర్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది.

నాంపల్లి కోర్టులో పోలీసుల పిటీషన్..(Phone Tapping Case)

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ క్రమంలో పోలీసులు చాల ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి సీఆర్పీసీ 73 కింద అరెస్ట్ వారంట్ జారీ చేయాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ పరిశీలించిన కోర్ట్ ఈ కేసుల్లో ప్రధాన సూత్రధారుడు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడానికి అనుమతి ఇచ్చింది . ప్రభాకర్ రావు పై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయనున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావుపై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ప్రస్తుతం ఆయన యూఎస్ ఏ లో ఉన్నారని దర్యాప్తు బృందం గుర్తించారు.

కేసులో కీలకంగా ప్రభాకర్ రావు..

ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు బృందం గుర్తించింది. కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కడ ఎయిర్‌ పోర్టులో దిగినా పట్టుకునేందుకు వీలుగా ఇప్పటికే పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. రెడ్‌ కార్నర్‌ నోటీసు, ఇంటర్‌పోల్‌ అధికారులను దర్యాప్తు బృదం సంప్రదించాలంటే కోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సీఆర్పీసీ 73 ద్వారా పోలీసులు అరెస్టు వారెంట్‌ తీసుకున్నారు.

Exit mobile version