NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 60 చోట్ల ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఏపీలో 40 చోట్ల, తెలంగాణాలో 20 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్నారన్న సమాచారంతో ఎన్ ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
నిధులతో పాటు యువతను సైతం మావోయిస్టుల వైపు మళ్లిస్తున్నారని ఆరోపణలు రావడం వల్లే.. పలు సంఘాల నేతల ఇళ్లల్లో అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతల ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ అల్వాల్‌లో భవాని, విద్యానగర్‌లో ఐఎపిఎల్ సురేశ్ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఉస్మాన్ సాహెబ్‌పేటలో ఎల్లంకి వెంకటేశ్వర్లు,నెల్లూరులో అరుణ, గుంటూరులో డా.రాజారావు, తిరుపతిలో క్రాంతి చైతన్య నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళంలో కె.ఎన్.పి.ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మిస్కా కృష్ణయ్య, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కులనిర్మూలన పోరాటసమితి నేత దుడ్డు వెంకట్రావు,సంతమాగులూరులో ఓరు శ్రీనివాసరావు, రాజమండ్రి బొమ్మూరులో పౌరహక్కుల నేత నాజర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం .5:30 నుంచి ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి.