Ram Kumar Reddy: మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి షాక్.. వెంకటగిరి ఇన్చార్జిగా రామ్ కుమార్ రెడ్డి

గత కొద్దికాలంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సీఎం జగన్ తనదైన శైలిలో షాక్ ఇవ్వనున్నారు

  • Written By:
  • Publish Date - January 3, 2023 / 08:13 PM IST

Ram Kumar Reddy: గత కొద్దికాలంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సీఎం జగన్ తనదైన శైలిలో షాక్ ఇవ్వనున్నారు. వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఖరారు చేసారు.

వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆనం రామానారాయణ రెడ్డి సీనియర్ గా తనకు మంత్రి పదవిఖాయమని అనుకున్నారు. అయితే నెల్లూరు జిల్లానుంచి మొదటివిడత అనిల్ కుమార్ యాదవ్ కు, రెండవవిడత కాకాని గోవర్దన్ రెడ్డికి జగన్ మంత్రి పదవులు ఇచ్చారు. దీనిని ఆనం జీర్ణించుకోలేకపోయారు. గతంలో కాంగ్రెస్ లో కీలకమైన ఆర్దికశాఖను నిర్వహించిన తనను జగన్ పక్కన పెట్టడం తనను అవమానించడమేనని భావించారు. దీనితో సందర్బం వచ్చినపుడల్లా మీడియాముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

నాలుగేళ్ల పాలనలో ఏమి చేశామని మళ్లీ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతామని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆనం.. ముందస్తు ఎన్నికలకు వెళితే ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇంకా ఉపేక్షించి లాభం లేదు అనుకున్న వైసీపీ అధిష్టానం ఆనంకి చెక్ పెట్టే నిర్ణ‌యం తీసుకుంద‌ని స‌మాచారం. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్చార్జిగా నేదురుమ‌ల్లి రామ్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసిన‌ట్టు తెలిసింది.