Site icon Prime9

KJ Shanti Fires on Roja: రోజా ఓటమితో నగరికి పట్టిన శని విరగడైంది.. నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి

KJ Shanti

KJ Shanti

 KJ Shanti Fires on Roja: నగరిలో రోజాకు మొదటి నుంచి ఇంటి పోరు ఇబ్బంది పెట్టింది . నగిరి నుంచి రోజా ఓడిపోవడంతో వైసీపీలోనే ఓ వర్గం సంబరం చేసుకుంటోంది. రోజా ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగరిలో రోజా ఓటమితో ఆమెపై అసమ్మతితో ఉన్న వర్గం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. సెల్ఫీ వీడియోతో తన ఆనందాన్ని పంచుకున్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి. పదేళ్లుగా ‘నగరికి పట్టిన శని విరగడైందని’ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పదేళ్లుగా నగరిలో కుటుంబ పాలనతో రోజా అక్రమాలకు పాల్పడ్డారని కీలక ఆరోపణలు చేశారు. రోజా సోదరులే పరిపాలన చేసారని విమర్శించారు .అందుకే నగరి ప్రజలు రోజాను భూస్థాపితం చేశారన్నారు. అదే విధంగా రోజా కూడా పోలింగ్‌ రోజే తన వ్యతిరేక వర్గంపై విమర్శలు చేశారు. సొంత పార్టీ నేతలే తనకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. . అసమ్మతివర్గం తన ఓటమితో సంబరాలు చేసుకుంటున్నా మాజీ మంత్రి రోజా మౌనంగానే ఉన్నారు. ఈ మౌనం వెనుక ఏమైనా బలమైన చర్యలు ఉన్నాయా.. ఈ పంచాయతీ అధినేత జగన్ దగ్గరకు తీసుకువెళ్తారా.. ఏం చేస్తారు అనేది వేచి చూడాలి.

రోజా ఓడిపోవడం ఆనందంగా ఉంది..( KJ Shanti Fires on Roja)

నగరిలో మొదటి నుంచీ రోజా కు కేజే శాంతి మధ్య పొసగ లేదు స్వపక్షంలోనే విపక్షంలాగా వీరిద్దరి వర్గాల మధ్య పాలిటిక్స్ కొనసాగాయి. బహిరంగంగానే ఈ రెండు వర్గాలు గొడవ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చివరకు పార్టీ అధినేత జగన్ సైతం వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలించలేదు. గతంలో విద్యాదీవెన నిధుల విడుదల సందర్భంగా నగరిలో ఓ సభ ఏర్పాటు చేశారు. ఆ వేదికపైనే ఇద్దరి చేతులు కలిపేందుకు జగన్ ప్రయత్నించారు. అయితే కేజే శాంతి రోజాకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు ఇష్టపడలేదు. మొహమాటంగా చెయ్యి కలిపినా.. ఆ చిరునవ్వు స్టేజ్‌ దిగకముందే చెరిగిపోయింది. రోజాను ఏమాత్రం అంగీకరించని శాంతి వర్గం అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించలేదనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఏకంగా 45 వేల ఓట్ల తేడాతో రోజా ఓడిపోయారు. రోజా ఓడిపోవడం చాలా ఆనందంగా ఉంది, ఆమె చేసిన అరాచకాలు భరించలేకే నగరి ప్రజలు తరిమికొట్టారంటూ కేజే శాంతి వీడియో రిలీజ్ చేశారు.

Exit mobile version