Site icon Prime9

Nagababu Comments: పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతీసి కొడతాను.. నాగబాబు

Nagababu

Nagababu

 Nagababu Comments:పవన్‌ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతీసి కొడతానని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అవినీతిపరులు, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇవ్వమన్నారు. ప్రజా సేవకులకే ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని స్పష్టం చేసారు.

చంద్రబాబు అరెస్ట్ బాధ కలిగించింది..( Nagababu Comments)

టీడీపీ-జనసేన పొత్తును జనసైనికులు స్వాగతిస్తున్నారని బీజేపీతో పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుందని తెలిపారు. సీఎం అభ్యర్థి ఎవరు అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తనకు బాధ కలిగించిందని నాగబాబు అన్నారు. చంద్రబాబు అరెస్టుపై జన సైనికులు ఆవేదనతో ఉన్నారని అన్నారు. టీడీపీ – జనసేన పొత్తుపై జనసైనికులు స్వాగతిస్తున్నారని కూడా నాగబాబు తెలిపారు. జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నాగబాబు ఆరోపించారు. జనసైనికులకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. జనసేనకు ప్రజల శ్రేయస్సు ముఖ్యమని అన్నారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో త్వరలో పవన్ ప్రకటిస్తారని నాగబాబు పేర్కొన్నారు.

ఆ మాట అంటే చెప్పుతో కొడతా | Nagababu Fires Reporter | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar