Nadendla Manohar comments ration in AP Assembly: అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అక్రమార్కులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారని సభ్యులు అడిగారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ కోసమే అన్నట్లుగా వైసీపీ నేతలు మార్చారని విమర్శలు చేశారు. గతంలో కంటే కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు.
అనంతరం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. మే నెల నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల భోజనానికి నాణ్యమైన బియ్యం అందిస్తామని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు, హాస్టళ్లకు నాణ్యతతో కూడిన బియ్యం సరఫరా చేస్తామన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. బియ్యం ఏ విధంగా సరఫరా చేయాలనేది త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని పేర్కొన్నారు.