Mynampally Hanumanth Rao: మంత్రి కేటీఆర్ వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో కేటీఆర్ వ్యవహార శైలిపై తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు. ఇక్కడ మోదీని గూండా అని తిట్టి ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుంటారంటూ ఎద్దేవా చేసారు.
గన్ మెన్లు లేకుండా ఎందుకు పోతారు?(Mynampally Hanumanth Rao)
నువ్వు ఒక డ్రగ్ అడిక్ట్ . పబ్ ల చుట్టూ తిరుగుతావు. కొకైన్ తీసుకుంటావు. పబ్ రాజావి. మరో పబ్ రాజాని తీసుకు వచ్చి మల్కాజిగిరిలో నాపై పోటీకి దింపావు. సినిమా యాక్టర్లతో తిరగడం, వేలాది ఎకరాలను కబ్డా చేయడం ఇదే నీకు తెలిసిన విద్య. మీ అయ్య ఒక పాస్ పోర్టు బ్రోకర్.. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లడానికి ఏడాదికి 10 కోట్లు చొప్పున పదేళ్లలో 80 కోట్లు ఖర్చు చేసాడని ఆరోపించారు. ఈ 80 కోట్లు ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవచ్చని అన్నారు. పదేళ్లలో లక్ష డబుల్ బెడ్ రూములయినా కట్టలేదు కాని ప్రగతిభవన్ ను, సెక్రటేరియట్ ను కట్టారంటూ విమర్శించారు. అమెరికాలో గిన్నెలు కడిగిన నువ్వు ఉద్యమం సమయంలో ఇక్కడకు దిగి తండ్రిని అడ్డుపెట్టుకుని మంత్రి పదవి సంపాదించావు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికీ నువ్వు, నీ తండ్రి అపాయింట్ మెంట్లు ఇవ్వరు. ఇంత అహంకారం దేనికి? నువ్వు, మీ బావ గన్ మెన్లు లేకుండా బెంగళూరు ఎందుకు పోతారు? అక్కడ ఏమి చేస్తారు? అని మైనంపల్లి ప్రశ్నించారు.
జైలుకు పంపడం ఖాయం..
మీ బావ అగ్గిపుల్ల గీయడం వలనే శ్రీకాంత చారి చనిపోయాడు. 1200 మంది ఉద్యమకారుల ఉసురు మీకు తగులుతుంది. ఉద్యమం సమయంలో మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా? తెలంగాణ ఉద్యమం సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేను నేను. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. అమెరికాలో నీలా గిన్నెలు కడగలేదు. రెస్టారెంట్, గ్రోసరీ నడిపాను. చదువుకునే తెలుగు విద్యార్దులకు ఉద్యోగాలు ఇచ్చాను. నువ్వు పడగొట్టిందేమిటి? నా తాట తీస్తానంటావా.. నేను గట్టిగా ఇస్తే మూడు సార్లు తిరుగుతావు. నా కన్నా పదేళ్లు చిన్నవాడివి. పెద్ద మాటలు మాట్లాడకు. ఇంగ్లీషులో రెండు ముక్కలు మాట్లాడితే మేధావినని అనుకుంటున్నావా? పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బందులు పెట్టాలని భావిస్తే భయపడేది లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిన్ను. మీ బావను జైలుకు పంపడం ఖాయం. ఇక మీరు బయటకు రాలేరు అంటూ మైనంపల్లి కేటీఆర్ ను హెచ్చరించారు.