Site icon Prime9

Pawan Kalyan’s sensational comments: నాకు ప్రాణహాని ఉంది.. సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan’s sensational comments: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేపట్టిన వారాహి విజయ యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో కాకినాడలో పార్టీ నాయకుల సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ప్రాణహాని ఉందని, సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉందంటూ పేర్కొన్నారు.

జనసేన నేతలు భధ్రతా నియమాలు పాటించాలి..(Pawan Kalyan’s sensational comments:)

జనసేన నేతలు, జనసైనికులు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలను పాటించాలని పవన్ సూచించారు. నేటి వైసీపీ పాలకులు అధికారంకోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని హెచ్చరించారు . అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దెదించే దిశగా జనసేన పయనిస్తోందని, ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని పవన్ తెలిపారు.నన్ను భయపెట్టే కొద్ది నేను మరింత రాటు దేలుతానని పవన్ చెప్పారు. గోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో ఒక్కటి వైసీపీకి దక్కకూడదని. వైసీపీ రహిత గోదావరి జిల్లాలుగా చూసేందుకు జనసేన పార్టీ ప్రణాళిక ఉండాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు. జనసైనికులు సభల్లో పాల్గొనే సమయంలో తనను కలిసేందుకు ప్రతిఒక్కరూ ప్రొటోకాల్ పాటించాలని పవన్ సూచించారు.

ప్రజల కష్టాలను వినే నాయకుడే..

డబ్బు, పేరు కాదు.. జనసేన పార్టీ శ్రేణులను బలమైన ఆలోచనా విధానం కలిపింది. మొదటి నుంచి ఓ నిర్దుష్ట విధానంలో నేను బతకాలని అనుకున్నాను. క్రమశిక్షణతో పాటు సమాజాన్ని చదువుతూ ముందుకెళ్లగలిగాను. నిత్యం నా మనసు బరువుగా ఉంటుంది. ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పే వేల వేదనలు నిత్యం వింటూ, రాత్రి వేళ వారి గురించి ఆలోచిస్తూ బరువెక్కిన గుండెతో నిద్రపోతాను. నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు లేవు… ప్రజల వేదనలు, వారి కన్నీటి గాథలే నన్ను మరింత రాటు దేల్చాయి. ఘోరమైన ఓటమి తర్వాత కూడా నేను నిలబడి ఉన్నానంటే వారికి ఏదైనా మేలు చేయాలన్న బలమైన సంకల్పమే ముందుకు నడిపిస్తోంది. నాకు డబ్బు వ్యామోహం లేదు. డబ్బు మనిషిగా మారితే పోరాట బలం పోతుందని బలంగా నమ్మేవాడిని. పీడితుల కోసం బలమైన భావజాలం ఉండాలని, అది నిర్దుష్టంగా ఉండాలని నమ్మే వ్యక్తిని. పార్టీ కోసం నిత్యం వేలాది మంది పనిచేస్తున్నారు. జనసేన పార్టీకి కోట్లాది మంది మద్దతు ఉంది. అందరినీ నేను కలవకపోవచ్చు. మీరు మాత్రం నా ప్రతినిధులుగా వారిని కలవండి. ప్రజల కష్టాలను వినే నాయకుడే భవిష్యత్తులో బలంగా మారతాడు. నన్ను చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయి నుంచి, మిమ్మిల్ని చూసి ఓట్లు వేస్తాం అనే స్థాయికి ప్రజలను తీసుకురావాలి. వారి కష్టాల్లో, కన్నీళ్లలో జనసేన ప్రతినిధులుగా మీరు తోడుగా ఉండాలని పవన్ అన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర కాకినాడ జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. జనసేన పార్టీ ముఖ్య నేతలతో పవన్ ప్రత్యేక సమావేశం కానున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కాకినాడలో జనసేన వారాహి విజయ యాత్ర పవన్ కళ్యాణ్ నిర్వహిస్తారు. ఆనంతరం సర్పవరం జంక్షన్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని వారాహి నుంచి పవన్ ప్రసంగించనున్నారు.

Exit mobile version