Mudragada Padmanabham: ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలు, పిఠాపురంవాసులకు వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను ముద్రగడ కోరారు.కాగా, ముద్రగడ లేఖలో..‘గతంలో గాజు గ్లాసు పగిలి ఆ ముక్కలు హాని కలిస్తాయని అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారు. ఎన్టీఆర్ పాలనలో అందరూ సైకిల్ తొక్కేవారు. ఇప్పుడు ఆ సైకిల్‌కి తుప్పు పట్టడంతో మోటర్ సైకిళ్లు, కార్లు వాడుతున్నారు. ప్రస్తుతం అందరి ఇళ్లలో ఫ్యాన్లు ఉన్నాయి. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ని మరో సారి ముఖ్యమంత్రి ని చేయాలనీ కోరుతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు.
జనసేన, టీడీపీ సముద్ర గర్భంలో ఉన్నాయి.. (Mudragada Padmanabham)
సీఎం జగన్‌కు ఓటు వేసే విషయంలో తప్పు చేస్తే శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారు. గతంలో వారి రాక్షస పాలన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాను ఒక్కసారి అందరూ చూడండి. కూటమిలో బీజేపీ మినహా జనసేన, టీడీపీ సముద్ర గర్భంలో ఉన్నాయని అన్నారు . . పేదల సంక్షేమం చూసే ముఖ్యమంత్రి జగన్‌ను గౌరవించాలని కోరుతున్నాను’అంటూ వ్యాఖ్యలు చేశారు.