Site icon Prime9

Mudragada Padmanabham: పొలిటికల్ రీ ఎంట్రీకి ముద్రగడ పద్మనాభం రెడీ

Mudragada

Mudragada

Mudragada Padmanabham:  పొలిటికల్ రీ ఎంట్రీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడీ అయిపోయారు. ముద్రగడతోపాటుగా ఆయన కుమారుడు కూడా పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా తండ్రీ కొడుకులు మొదలు పెట్టేశారు. నిన్న జనసేన నేతలు, ఇవాళ టిడిపి నేతలు ముద్రగడని కలవడంతో ఉభయగోదావరి జిల్లాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది.

బుధవారం అర్ధరాత్రి ముద్రగడ నివాసానికి జనసేన నాయకులు కందుల దుర్గేష్, తాడేపల్లి గూడెం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ లు వెళ్లడంతో ముద్రగడ జనసేనలోకి చేరుతారనే ఊహాగానాలు పెరిగాయి. తాజాగా టిడిపి నేత జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వెళ్ళారు. ఇద్దరు నేతలూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తాజా రాజకీయాలపై చర్చించుకున్నారు. నిన్న జనసేన పార్టీ నాయకులు, ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు ముద్రగడని కలవడంతో జగ్గంపేట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

వైసీపీలో చేరం..(Mudragada Padmanabham)

అయితే వైసిపిలో చేరడానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆసక్తిగా లేరని ఆయన కుమారుడు గిరిబాబు మీడియాకి చెప్పారు.టీడీపీ – జనసేనలో ఏదో ఒకదానిలో చేరేందుకు అవకాశాలున్నాయని గిరిబాబు అన్నారు. పద్మనాభంతోపాటుగా తాను కూడా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నామని, ఏదైనా పార్టీలో చేరిన తరువాతే నిర్ణయం ఉంటుందని గిరిబాబు తెలిపారు. కాకినాడ పార్లమెంట్, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం స్థానాలనుంచి పోటీ చేసేందుకు తామిద్దరికీ ఇంట్రెస్ట్ ఉందని ముద్రగడ గిరిబాబు వివరించారు.గతంలో చెప్పినట్లుగానే ఈ సారి కచ్చితంగా పోటీ చేయడం ఖాయమని ముద్రగడ గిరిబాబు స్పష్టం చేశారు. త్వరలోనే నిర్ణయం ఉంటుందని, అన్నింటికీ సిద్ధపడి గ్రౌండ్ వర్క్ ప్రారంభించామని గిరిబాబు వెల్లడించారు.

TDP Leader Jyothula Nehru Meets To Mudragada Padmanabham | Prime9 News

Exit mobile version
Skip to toolbar