Site icon Prime9

Nara Lokesh: నారా లోకేష్ భుజానికి ఎంఆర్ఐ స్కానింగ్.. ఎందుకో తెలుసా?

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ఇటీవల 100 రోజులు పూర్తి చేసుకుని ప్రస్తుతం నంద్యాల జిల్లాలో కొనసాగుతోంది. అయితే నారా లోకేష్ భుజానికి గాయం కావడంతో స్థానిక డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించారు.

50 రోజులుగా నొప్పి.. (Nara Lokesh)

నంద్యాల పద్మావతి నగర్‌లోని ఎంఆర్ఐ సెంటర్‌లో లోకేష్‌ కుడి భుజానికి స్కానింగ్ చేశారు. అనంతపురం జిల్లాలో కార్యకర్తల తోపులాటలో లోకేష్ కుడి భుజానికి గాయమైంది. అప్పటి నుంచి నొప్పితోనే పాదయాత్ర చేస్తున్న లోకేష్ 50 రోజులుగా నొప్పి తగ్గకపోవడంతో స్కానింగ్ చేయించాలని డాక్టర్లు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు లోకేష్ తన కుడి భుజానికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు.

లోకేష్ గాయం గురించి టీడీపీ కార్యకర్తలు పెద్దగా ఆందోళన చెందుతున్నారు. వైద్యులు ఏదైనా సర్జరీని సూచిస్తే యువ గళం పాదయాత్రకు బ్రేక్ పడే అవకాశం ఉంది. కానీ ఈ పాదయాత్రను విరమించే ఆలోచనలో లోకేష్ లేరు. పాదయాత్ర కొనసాగించాలని లోకేష్ కృతనిశ్చయంతో ఉన్నారని, అది పూర్తయిన తర్వాతే ఆయన భుజంపై దృష్టి సారిస్తారని టీడీపీ వర్గీయులు చెబుతున్నారు. దీనితో లోకేష్ టీడీపీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆయన కష్టానికి తగిన ఫలితం వస్తుందని పార్టీ భావిస్తోంది.

Exit mobile version