Site icon Prime9

MP Rammohan Naidu: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు

MP Rammohan Naidu'

MP Rammohan Naidu'

MP Rammohan Naidu: ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్‌పై హోంమంత్రి అమిత్ షాకు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సిఐడి చీఫ్ సంజయ్ సర్వీస్ రూల్స్ అన్నీ ఉల్లంఘించారంటూ ఆధారాలు సమర్పించారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి సిఐడి చీఫ్ సంజయ్ వైసీపీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పక్షపాతంతో పనిచేస్తున్నారు..(MP Rammohan Naidu)

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ సరైన విచారణ లేకుండా చేశారని నాయుడు ఆరోపించారు. సీఐడీ చీఫ్ రాజకీయ పక్షపాతంతో పని చేస్తూ నిష్పాక్షికతను ఉల్లంఘిస్తున్నారని, సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి ప్రతిపక్షాల పరువు తీసేందుకు సీఎం జగన్ సీఐడీని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్‌కోసం ప్రతిపక్షాలపై బురద చల్లుతున్నారని ఎంపీ రామ్మోహన్ ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారి, విచారణ చేయాల్సిన అధికారి ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయడం సరికాదని రామ్మోహన్ నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తులో గోప్యంగా ఉంచాల్సిన అంశాలని మీడియాకు విడుదల చేస్తున్నారని, ఇది తీవ్రమైన నేరమని లేఖలో ఎంపీ రామ్మోహన్ నాయుడు వివరించారు.

రెండు రోజుల కిందట టీడీపీ ఎంపీలు నారా లోకేష్‌తో పాటు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు, ఈ విషయంలో జోక్యం చేసుకుని, చంద్రబాబును అరెస్టు చేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ టీడీపీ ఎంపీలు రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించారు.

 

Exit mobile version