MLA Rajasingh: ఓవైసీకి దమ్ముంటే గోషా మహల్ లో ఎం.ఐ.ఎం అభ్యర్థిని నిలబెట్టాలి.. ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్

ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. దమ్ముంటే గోషా మహల్ లో ఎం.ఐ.ఎం అభ్యర్థిని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థికి లబ్ధిచేకూర్చేందుకు ఎం.ఐ.ఎం అభ్యర్థిని గోషామహల్ నుంచి నిలబెట్టడం లేదని రాజాసింగ్ ఆరోపించారు.

  • Written By:
  • Publish Date - October 18, 2023 / 04:01 PM IST

 MLA Rajasingh: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. దమ్ముంటే గోషా మహల్ లో ఎం.ఐ.ఎం అభ్యర్థిని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థికి లబ్ధిచేకూర్చేందుకు ఎం.ఐ.ఎం అభ్యర్థిని గోషామహల్ నుంచి నిలబెట్టడం లేదని రాజాసింగ్ ఆరోపించారు.

ఓవైసీది బ్లాక్ మెయిలింగ్ రాజకీయం ( MLA Rajasingh)

గోషామహల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి కారణం అసదుద్దీన్ ఓవైసీయేనని మండిపడ్డారు. అసదుద్దీన్ కొత్త వ్యాపారానికి తెర తీశారని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా వారి పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. గోషామహల్ లో ఓవైసీ అభ్యర్థులతో బిజినెస్ చేస్తాడు.ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు నిలబడాలో ఎంఐఎం పార్టీ ఆఫీస్ నుంచే డిసైడ్ అవుతది. 2014 ఎన్నికల్లో ముకేష్ గౌడ్ కు మద్దతు ఇచ్చేందుకు ఒవైసీ డబ్బులు తీసుకున్నాడు.2018 ఎన్నికల్లో బీఅర్ఎస్ అభ్యర్థిని దారుసలేం నుంచే డిసైడ్ చేసిండు. 2023 ఈ ఎన్నికల్లో కూడా డారుసలెం నుంచే అభ్యర్థి ఎంపిక ఉంటుంది.డారుసలేం కు ఇంకా డబ్బుల సంచులు వెళ్తే అభ్యర్థి ఎంపిక అయిపోతుందని రాజాసింగ్ ఆరోపించారు.

రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ఒవైసీలకు లేదని రాజాసింగ్ అన్నారు.ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ కాళ్ళు పట్టుకొని, ఇల్లీగల్ దందాలు చేసే చరిత్ర ఒవైసీ లదని అన్నారు.ఒవైసీ కుటుంబమే అభివృద్ధి చెందుతోంది తప్ప ముస్లిం వర్గాలు కాదు. ముస్లింలను ఓట్లు అడగను. వాళ్ళు నాకు ఒట్లేయరు. వాళ్ళ ఓట్లు నాకు అవసరం లేదని రాజాసింగ్ అన్నారు. నా నియోజకవర్గంలో మీ అభ్యర్థిని పెట్టడానికి నీకు దమ్ము లేదా…?నీవు వస్తావా? మీ తమ్ముడు వస్తాడా? మీరు రండి ఒక్క ఓటు కూడా పడనీయను అని రాజాసింగ్ అన్నారు.