Site icon Prime9

Kadiam Srihari: ఎమ్మెల్యే రాజయ్య తల్లులకు క్షమాపణ చెప్పాలి.. కడియం శ్రీహరి

Kadiam Srihari

Kadiam Srihari

Kadiam Srihari: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య బేషరతుగా తల్లులకు క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరి అన్నారు. తన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఏపీ, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని రాజయ్య అంటున్నారని మీ దగ్గర ఉన్న తన ఆస్తుల వివరాలు తీసుకురావాలని కడియం చెప్పారు. వారం రోజుల్లో ఆధారాలతో సహా రావాలని లేకుంటే క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరి అన్నారు.

రాజయ్య దిగజారి మాట్లాడుతున్నారు..(Kadiam Srihari)

తానూ ఒక ఎమ్మెల్యే అని మర్చిపోయి రాజయ్య దిగజారి మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి ఆరోపించారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజయ్య పార్టీ లైన్ దాడి మాట్లాడుతున్నారు. రాజయ్య గెలుపు కోసం నేను తీవ్రంగా కృషి చేశాను. రాజయ్య తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు. రాజయ్య వ్యాఖ్యలు నన్ను బాధించాయి.బేషరతుగా రాజయ్య క్షమాపణ చెప్పాలి. నా తల్లి బీసీ.. నా తండ్రి ఎస్సీ కాబట్టి నేనూ ఎస్సీనే. ప్రతీ ఒక్కరి తల్లిని అవమానించేలా రాజయ్య మాట్లాడారని కడియం శ్రీహరి అన్నారు.

అంతకుముందు కడియం శ్రీహరి పద్మశాలి కులంలో పుట్టిన తరువాత బైండ్ల కులంలో పెరిగారని రాజయ్య ఆరోపించారు. తన కులమేంటో శ్రీహరి నిరూపించుకోవాలని రాజయ్య డిమాండ్ చేశారు. తన కూతురు కావ్యకి ఎమ్మెల్యే టికెట్ కోసం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దగ్గర శ్రీహరి పైరవీలు చేస్తున్నట్లు ఆధారాలు బయటికి వస్తున్నాయని రాజయ్య చెప్పారు.కడియం శ్రీహరి చేసేవి మొత్తం బ్లాక్‌మెయిల్ రాజకీయాలు. మాదిగల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. రాజకీయంగా దళితులు ఎదిగితే ఏదో కేసు పెట్టి చిత్రహింసలకు గురి చేశాడని ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు.

 

Exit mobile version