Site icon Prime9

MLA Quota MLC: ఎమ్మెల్సీ బెర్తులపై కసరత్తు.. ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీగా సామ రామ్మోహన్ రెడ్డికి ఛాన్స్?

MLA Quota MLC Seats In Congress: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ బెర్తులపై కసరత్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ బయలుదేరనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో సీఎం చర్చించి అభ్యర్థులపై రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెండు రోజులపాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మార్చి 29న వరకు శాసన మండలిలో 5 స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం ఖాళీ అయిన 5 స్థానాల్లో 4 కాంగ్రెస్‌కే దక్కే అవకాశం ఉంది. ఈ స్థానాలకు గానూ ఎన్నికల సంఘం నోటీఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఈ నెల 10వరకు వరకు నామినేషన్లకు సమయం ఇచ్చారు. మార్చి 20న పోలింగ్ జరగనుంది.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డికి ఒక ఎమ్మెల్సీ స్థానం ఖరారైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు గానూ సామపైనే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవకులకు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల పేర్లు బాగా వినిపించాయి. అయితే వన్ లీడర్ వన్ పోస్ట్ నిర్ణయంతో నరేందర్ ఇప్పటికే చాలా అవకాశాలు పొందారని పలువురు నేతలు వ్యతిరేకించారు. దీంతో సీనియారిటీ సంప్రదాయాన్ని కాదని వన్ లీడర్ వన్ పోస్ట్‌తో పాటు యువకులను అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే.. పార్టీలో మొదటి నుంచి యాక్టివ్‌గా ఉంటున్న సామ రామ్మోహ్ రెడ్డికి ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది.

Exit mobile version
Skip to toolbar