Site icon Prime9

Medigadda Barrage: ఈనెల 29న మేడిగడ్డకు వెళ్లనున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు

Medigadda barrage

Medigadda barrage

Medigadda Barrage: ఈ నెల 29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రులు మెడిగడ్డ బయలుదేరుతారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్..(Medigadda Barrage)

ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలు వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం.. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు తెలపనున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్, మెడిగడ్డ, సిందిళ్ళ, అన్నారం బ్యారేజ్ ల సమస్యలు, వాటి పరిష్కారాలు.. తదితర అంశాలపై సమీక్ష జరపనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మెడిగడ్డ, అన్నారం బ్యారేజ్ లను మంత్రులు పరిశీలించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లలకు, ఈ నిర్మాణంతో సంబంధం ఉన్న వారికి అందరికి సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఈ.ఎన్.సిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

 

Exit mobile version