Minister satyavathi Rathod-: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ బంజారాహిల్స్ లోని బంజారాభవన్ లో గిరిజన సంస్కృతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రికి బంజారా సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం పలికారు. అక్కడే పచ్చబొట్టు స్టాల్ కనిపించడంతో మంత్రి సత్యవతి రాథోడ్ తన చేతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు. అనంతరం పచ్చబొట్టు వేసిన మహిళకు మంత్రి నగదు బహుమానం అందజేశారు.
కాంగ్రెస్ కన్నా 9 రెట్లు ఎక్కువ నిధులు..( Minister satyavathi Rathod)
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో గిరిజన సంక్షేమానికి 6 వేల కోట్లు ఖర్చు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో గిరిజన సంక్షేమానికి 53 వేల కోట్లు ఖర్చు చేసిందంటే గిరిజనులపై కేసీఆర్ కు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేళ్లలో జరిగిందన్నారు. బంజర్లు, ఆదివాసీలపై వరాలు కురిపించిన కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని రాథోడ్ అన్నారు.
కేసీఆర్ పోడుభూములకు పట్టాలు, తాండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో పాటు రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, గిరిజన రిజర్వేషన్లను 10 శాతం పెంచారని అన్నారు. గిరిజనుల జీవితాలు. గిరిజనులు ఎదగాలని గిరిజన పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఆహార సదుపాయాలు, ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందిస్తున్నామన్నారు. గతంలో ఏ నాయకుడు చేయనంతగా కేసీఆర్ గిరిజనులకు చేసారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.