Gunmen suicide: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఒక హోటల్ లో తుపాకీతో పాయింట్ బ్లాంక్ లో కాల్చుకొని సూసైడ్ కు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే అతను కాల్చుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక సమస్యల కారణంగానే..(Gunmen suicide)
విషయం తెలియగానే పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకుంటున్నారు. కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు విభాగంలో పని చేస్తున్న ఏఎస్‌ఐ మహ్మద్ ఫాజిల్ మంత్రికి పోలీసు ఎస్కార్ట్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.ఫాజిల్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని, అతను నిరాశకు గురయ్యాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.అతనికి ఇద్దరు ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల, జాతీయ బ్యాంకు రుణం కోసం అతని దరఖాస్తును తిరస్కరించిందని డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు.మృతుడు ప్రైవేట్ లోన్ యాప్‌ల నుండి ఒత్తిడితో ఉన్నాడని వచ్చిన పుకార్లను ఆయన తోసిపుచ్చారు.