Minister Wife Fires on Police: ఏపీలో కొంతమంది టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకముందే ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా సోమవారం రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వార్తల్లో కెక్కారు.
నీకు జీతం ఎవరిస్తున్నారు ? ( Minister Wife Fires on Police)
రాయచోటిలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి భార్య హరితా రెడ్డి పెన్షన్ల పంపిణీకి తనకు ఎస్కార్టుగా రావాలంటూ పోలీసులను ఆదేశించారు. ఈ సందర్బంగా ఆలస్యంగా వచ్చారంటూ ఎస్ఐ రమేష్ పై మండిపడ్డారు. తాను కాన్ఫరెన్స్ లో ఉన్నానని చెప్పినప్పటికీ ఆమె వినలేదు. సీఐకు లేని కాన్ఫరెన్స్ నీకేంటి? నీకు జీతం ఎవరిస్తున్నారంటూ నిలదీసారు. మీ కోసం అర్దగంటనుంచి వెయిట్ చేస్తున్నాను అంటూ మండిపడ్డారు. విధిలేని స్దితిలో మంత్రిగారి భార్యకు ఎస్సై ఓకే మేడమ్ అంటూ సెల్యూట్ చేసారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మంత్రి రాంప్రసాద్ భార్యపై విమర్శలు గుప్పిస్తున్నారు.