Site icon Prime9

Pinipe Vishwarup: వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి పినిపే విశ్వరూప్.. ఏమిటో తెలుసా?

Pinipe Vishwarup

Pinipe Vishwarup

Pinipe Vishwarup: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లకు మంత్రి పినిపే విశ్వరూప్ శుభవార్త చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ వాలంటీర్లకు రూ.15 వేల జీతం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నట్టు వివరించారు. కోనసీమ జిల్లాలో అల్లవరంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో ఆయన మీటింగ్ నిర్వహించారు. కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి, వైకాపా తిరిగి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు. వేరే పార్టీ రూలింగ్‌లోకి వస్తే వలంటీర్‌ ఉద్యోగాలు తీసివేస్తుందని చెప్పారు.

సీఎం జగన్‌ త్వరలోనే వలంటీర్లపై దృష్టిసారించారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారి పాత్రే కీలక. వలంటీర్ల వ్యవస్థ క్షేత్ర స్థాయిలో ఎలా ఉందనే విషయంపై త్వరలోనే నివేదిక తీసుకునే అవకాశం ఉంది. ఆపై జిల్లా వారీగా వలంటీర్లతో నేరుగా ముఖ్యమంత్రే మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సంక్షేమ ఫలాలు పొందని లబ్ధిదారులను ఆరు నెలలకు ఒకసారి గుర్తిస్తూ.. వారికి పథకాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుతోందన్నారు మంత్రి విశ్వరూప్. నియోజకవర్గ పరిధిలో 1200 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు. పేదరికమే ప్రామాణికంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పింఛను ఇస్తోందని గుర్తు చేశారు. పింఛన్లు తొలగింపు అనేది దుష్ప్రచారమేనని ఎవరూ నమ్మొద్దన్నారు.

Exit mobile version