Damodara Rajanarsimha: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. దామోదర రాజనరసింహ ఫేస్ బుక్ లో కొంతమందిబీజేపీ, టీడీపీ, తమిళనాడు లోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులు పెట్టారు. కొందరు నాయకులు దామోదరకు కాల్ చేసి విషయాన్ని చెప్పారు.
సైబర్ పోలీసులకు ఫిర్యాదు..( Damodara Rajanarsimha)
వెంటనే తన ఫేస్ బుక్ ను పరిశీలించిన దామోదర తన ఫేస్ బుక్ ఎవరో హ్యాక్ చేశారని గుర్తించారు. దీనితో అధికారులు హ్యాకర్లను గుర్తించే పనిలో పడ్డారు. ఈ నేపధ్యంలో దామోదర ఫేస్ బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్ లకుస్పందించవద్దని కార్యకర్తలకి మనవి చేశారు. ఏమైనా మెసేజ్ లు వస్తే పోలీసులకు తెలిపాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీజేపీ, టీడీపీ, తమిళనాడులోని రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులను వందల సంఖ్యలో మంత్రి ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు. దీనితో కార్యకర్తలను అప్రమత్తం చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇటీవల కాలంలో ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసే ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.