Margadarshi chits scam case: మార్గదర్శి చిట్స్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడి అధికారులు దూకుడు పెంచారు. జూబ్లీహిల్స్ రామోజీరావు నివాసానికి చేరుకున్న ఏపీ సిఐడి అధికారులు మార్గదర్శి ఎండి శైలజా కిరణ్‌ని ప్రశ్నిస్తున్నారు. వీడియో, ఫుట్ కెమెరాలు, ప్రింటర్స్‌తో సిఐడి బృందాలు వచ్చాయి. చందాదారుల నగదు ఎక్కడికి తరలించారు అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. రామోజీ గ్రూప్ కంపెనీలకు చిట్ ఫండ్స్ నిధులు మళ్లించినట్టు గుర్తించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థకు చెందిన ఆస్తులను సిఐడి ఇటీవలే అటాచ్ చేసింది.
రూ.793 కోట్ల ఆస్తుల అటాచ్ .. (Margadarshi chits scam case)
మార్గదర్శికి సంబంధించిన 793.50కోట్ల విలువైన చరాస్తులను ఇప్పటికే సిఐడి అటాచ్ చేసింది. మార్గదర్శిలో చైర్మన్, ఎండీ, ఫోర్‌మెన్, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్టు సీఐడీ తేల్చింది. చిట్స్‌ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్ముని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు సిఐడి నిర్ధారించింది. కస్టమర్లకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో సంస్థ లేదని సిఐడి అధికారులు చెబుతున్నారు. చిట్‌ఫండ్స్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు సిఐడి అధికారులు గుర్తించారని సమాచారం.