MLA Alla Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) పార్టీకి తన పదవికి రాజీనామా చేశారు. స్సీకరి్ తమ్మినేని సీతారాంకి తన రాజీనామా లేఖని పంపించారు. కొంతకాలంగా పార్టీ అధిష్టానం పట్ల ఆళ్ళ రామకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీనితో స్పీకర్ ఫార్మాట్లొ రాజీనామా లేఖని ఆళ్ళ రామకృష్ణారెడ్డి సమర్పించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం టిక్కెట్టును వేరే వారికి ఇస్తారంటూ వార్తలు వస్తున్నాయి. గంజి చిరంజీవిని మంగళగిరి నియోజకవర్డానికి ఇన్ చార్జిగా నియమించడం, ఆదివారం అతను పార్టీ కార్మయాలయాన్ని ప్రారంభించడం పట్ల ఆర్కే కలత చెందినట్లు కనిపిస్తోంది. మరోవైపు గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ స్దాయిలో పనులు పూర్తికాకపోవడం పట్ల కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీనితో ఆయన సోమవారం తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసారని తెలుస్తోంది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుల్లో ఒకరయిన ఆర్కే రాజీనామాను ఆమోదిస్తారా? లేక బుజ్జగిస్తారా అన్నది చూడాలి. ఏమైనా ఆర్కే రాజీనామా వ్యవహారం అధికార పార్టీలో సంచలనం కలిగిస్తుందని చెప్పవచ్చు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014, 2019 లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో సీఎం జగన్ అతడిని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్ద (సీఆర్డీఏ) చైర్మన్ గా నియమించారు. ఆర్కే వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచి అమరావతి భూ సమీకరణపై పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసారు. ఇటీవల ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేసారు.