Site icon Prime9

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

Macherla MLA

Macherla MLA

 MLA Pinnelli Ramakrishna Reddy:నిజాలు నిలకడ మీద తెలుస్తాయని సామెత .ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలు ఈ సామెతను నిజం చేస్తున్నాయి . పోలింగ్ రోజు జరిగిన ఘటనలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గం లో పోలింగ్ రోజు అనేక ఘర్షణ పూరిత ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇందులో ప్రధానంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటు సమీపంలో ఉన్న 2002 పోలింగ్ బూతులకు ప్రవేశించి ఆగ్రహంతో ఈవీఎం ను పగలగొట్టారు.ఈ ఘటన సిసిటీవీలో రికార్డు అయింది. పోలింగ్ జరిగి తొమ్మిది రోజులు అవుతున్న ఇప్పటివరకు వెలుగులోకి రాని సిసి కెమెరా లో రికార్డ్ అయిన వీడియో అకస్మాత్తుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఇది ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.ప్రధాన పార్టీలైన వైసీపీ టిడిపి ఒకరిపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈవీఎం పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది .

పిన్నెల్లి పై కేసు..(MLA Pinnelli Ramakrishna Reddy)

దింతో అన్ని పోలింగ్‌ కేంద్రాల వీడియో ఫుటేజీని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు పోలీసులకు అప్పగించారని.. విచారణ అనంతరం పిన్నెల్లిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తమకు తెలియజేశారని సీఈవో కార్యాలయం వెల్లడించింది .ఈ క్రమంలో జిల్లాలోని గురజాల మాచర్ల నరసరావుపేట, సత్తనపల్లి పెదకూరపాడు నియోజకవర్గాలలో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వివరాలు ఈసీ సేకరించింది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో పర్యటించిన సిట్ బృందం అనేకమంది పై కేసు నమోదు చేసిన విషయాన్ని పరిశీలించింది. సుమారు 350 మంది పై కేసు నమోదు చేసిన విషయం తెలుసుకున్న సిట్ బృంద ఇప్పటికే డీజీపీకి సీఎస్ కు నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే .

అరెస్టుకు రంగం సిద్దం..

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లి సోదరుల కోసం తెలంగాణలో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పిన్నెల్లి డ్రైవర్, అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి కోసం ఏపీ, తెలంగాణ టాస్క్‌ఫోర్స్ గాలిస్తోంది. సంగారెడ్డి జిల్లా కంది దగ్గర పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్నారు. కారులోనే మొబైల్ వదిలి పిన్నెల్లి బ్రదర్స్ పారిపోయారు. ఏ క్షణమైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

మాచర్లలో జరిగిన ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందని తెలిపారు. సిట్ పోలీసుల నుంచి వివరాలన్నీ తీసుకున్నామని కేసులో ఏ-1గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరొందని మీనా వివరించారు. 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేసినట్లు చెప్పారు. నిన్నటి నుంచి పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

 

 

Exit mobile version