Site icon Prime9

CM Jagan Comments: గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను చూడండి.. సీఎం జగన్

jagan

jagan

 CM Jagan Comments: వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వీవర్స్‌ కాలనీ వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ఈ పథకం లబ్దిదారులకు సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల 25వేల 20 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ వృత్తులవారికి 3 వందల 25 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు.

కుప్పంలో కూడా  ఇళ్ల స్థలాలు ఇచ్చాము..( CM Jagan Comments)

ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ గత పాలనకు, ఇప్పటిపాలనకు తేడా చూడాలని ప్రజలను కోరారు. వెనుకబడిన వర్గాలకు తోడుగా ఉండి నాలుగో ఏడాది జగనన్న చేదోడు అందజేస్తున్నామని అన్నారు. గత పాలనలో దోచుకో, పంచుకో, తినుకో ఉండేదన్న జగన్ ఇపుడు లబ్దిదారుల ఖాతాల్లోకే నేరుగా నిధలుు జమ అవుతున్నాయని అన్నారు. బీసీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుదన్న జగన్ మ్యానిఫెస్టోను చెత్త బుట్టలో పడేసారని ఆరోపించారు. కుప్పం ప్రజలకు కూడా చంద్రబాబు చేసిందేమీలేదు. కుప్పంలో మన ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు ఇచ్చింది. చంద్రబాబు పాలనలో సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు మోసం చేశారు. ప్రజలు ఏం కావాలన్నా గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు.

రాజధాని భూముల నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ వరకు స్కామ్‌లే చేసిన చరిత్ర గత పాలకులదని సీఎం జగన్ అన్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలను మార్చామని చెప్పారు. జగనన్న సురక్ష ద్వారా అందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు.31 లక్షల ఇళ్ల స్థలాలను అక్కాచెల్లెమ్మలకు ఇచ్చామని తెలిపారు. రాబోయేది కురుక్షేత్ర యుద్ధమని, పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరగబోతోందని జగన్ అన్నారు. అందరూ ఏకమవుతారని వారు చెప్పేది నమ్మకండని అన్నారు. మీ బిడ్డ పాలనలో మీకు మంచి జరిగిందా లేదా అన్నదే చూడండని జగన్ పేర్కొన్నారు.

 

గత ప్రభుత్వానికి.. మీ బిడ్డ ప్రభుత్వానికి తేడా గమనించండి | YS Jagan Mohan Reddy | Prime9 News

Exit mobile version
Skip to toolbar