Siddharth Luthra:చంద్రబాబుతో లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ములాఖత్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును లూథ్రా కలిశారు. న్యాయపరమైన విషయాలపై చంద్రబాబుతో లూథ్రా చర్చించారు. 45 నిమిషాల చర్చల అనంతరం బయటకి వచ్చిన లూథ్రా మీడియాతో మాట్లాడలేదు. నేరుగా లోకేష్ బస చేసిన ఇంటికి వెళ్ళారు. చంద్రబాబుతో చర్చించిన అంశాలని లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణికి వివరించారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు.
కత్తి తీసి పోరాటం చేయడమే..(Siddharth Luthra)
అంతకుముందు సిద్ధార్థ్ లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైనదన్న గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విటర్లో షేర్ చేశారు. ఈరోజు ఇదే మా నినాదం అని ఆయన పేర్కొన్నారు. దీంతో మీరే గెలుస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రిమాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఆయన ఈ ట్వీట్ చేసారు. దీనికి సంబంధించి కోర్టు విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.