KTR Tweet: ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తున్న సందర్బంగా గత పదేళ్లలో ఈ రాష్ట్రానికి ఏం చేసారో చెప్పి ఓట్లడగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. దయచేసి పవిత్రమైన నేలపై విషం చిమ్మకండని కోరారు. పిరమైన ప్రధాని నరేంద్రమోదీగారు మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలోయావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అంటూ సామాజిక మాధ్యమం x వేదికగా ప్రశ్నలు సంధించారు.
తెలంగాణ హామీలను ఎందుకు మరిచారు? ( KTR Tweet)
ఒక్క తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుకు.. ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదో చెప్పండి..మా యువతకు ఉపాధినిచ్చే…కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారో చెప్పండి.మా ఏజెన్సీ బిడ్డలకు బతుకు దెరువునిచ్చే. బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఎందుకు బొందపెట్టారో చెప్పండి.మా నవతరానికి కొండంత భరోసానిచ్చే.. ఐటీఐఆర్ ITIR, Hyderabad ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పండి.ప్రధానిగా పదేళ్లు గడిచినా.. తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి..తమ పిల్లల బంగారు భవితపై ఆశలు పెట్టుకున్న.. లక్షలాది తల్లిదండ్రుల ఆశయంపై ఎందుకు నీళ్లు జల్లారో చెప్పండి.తెలంగాణకు ఒక్క నవోదయ, ఒక్క మెడికల్ కాలేజీ.. ఒక్క నర్సింగ్ కళాశాల, ఒక్క ఐఐటీ, ఒక్క ట్రిపుల్ ఐటీ.. ఒక్క ఐఐఎం, ఒక్క ఐసర్, ఒక్క ఎన్.ఐ.డీ. ఎందుకు ఇవ్వలేదో చెప్పండి.లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండినా..200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నా..కాంగ్రెస్ సర్కారు పాపానికి నేతన్నలు బలైపోతున్నా..తెలంగాణ వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో చెప్పండి అంటూ కేటీఆర్ ప్రధాని మోదీని ప్రశ్నించారు.