Site icon Prime9

Komatireddy Venkata Reddy: అలిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. బుజ్జగించిన కాంగ్రెస్ నేతలు

Komatireddy

Komatireddy

 Komatireddy Venkata Reddy: భువనగిరి ఎంపి, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి మరోసారి అలిగారు. ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల్లో తనకి స్థానం దక్కలేదని కోమటిరెడ్డి మనస్థాపానికి గురయ్యారు. మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కసరత్తు చేస్తున్నా ఆ వైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కన్నెత్తి కూడా చూడలేదు.

కాంగ్రెస్ పార్టీ వైబ్రెంట్ లీడర్..( Komatireddy Venkata Reddy)

విషయం తెలుసుకున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కోమటి రెడ్డి ఇంటికి వెళ్ళారు. బుజ్జగించేందుకు ప్రయత్నించారు. కానీ కోమటిరెడ్డి ససేమిరా అంటున్నారు. తన ఆత్మగౌరవమే తనకి ముఖ్యమని కోమటిరెడ్డి తేల్చి చెప్పేశారు. దీంతో కోమటిరెడ్డి ఇంటికి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే, భట్టి విక్రమార్కా వెళ్లారు. కోమటిరెడ్డికి ఎటువంటి అసంతృప్తి లేద ఠాక్రే తెలిపారు. సాధారణంగానే కలిసామని భట్టి విక్రమార్క తెలిపారు.కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ వైబ్రెంట్ లీడర్ అని, అలగడం లాంటిది ఏం లేదని అన్నారు

Exit mobile version