Site icon Prime9

Kidney Racket in Guntur: రూ.30లక్షలిస్తామని నమ్మించి గుంటూరులో ఆటోడ్రైవర్ కిడ్నీ దోచేసిన ముఠా

kidney Racket

kidney Racket

Kidney Racket in Guntur: విజయవాడలో కిడ్నీ రాకెట్ మోసం బయటపడింది. గుంటూరు కేవిపి కాలనీలో ఉండే మధుబాబు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాడు. కరోనా సమయంలో ఏం చేసినా కలిసి రాకపోవడంతో ఆటో వేసుకొని జీవనం సాగించాడు. అయితే ఈక్రమంలోనే పెద్ద ఎత్తున చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సతమతం అయ్యాడు. అప్పటి నుండి రెండేళ్ల పాటు అప్పులు తీర్చటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత ఏడాది చివర్లో ఒకరిచ్చిన సలహాతో కిడ్నీ అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు.

ఈ సమయంలోనే బాషా అనే వ్యక్తి మధుబాబుకు పరిచయమయ్యాడు. ఫేస్ బుక్ లో ఉన్న యాప్స్ ద్వారా కిడ్ని అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చాడు. తాను కూడా కిడ్ని అమ్ముకున్నట్లు చెప్పాడు. దీంతో మధుబాబు ఫేస్ బుక్ లోకి యాప్స్ ద్వారా కిడ్ని అమ్మేందుకు సిద్దం అయ్యాడు. అప్పుడే బాషా ద్వారా వెంకట్ అనే మరొక వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు కావాల్సిన వారికి కిడ్నీ ఇస్తే ముప్పై లక్షలు ఇస్తానని చెప్పాడు. దీంతో మధుబాబు కిడ్ని ఇచ్చేందుకు సిద్దమయ్యాడు.

లక్షా పదివేల రూపాయలు మాత్రమే..(Kidney Racket in Guntur)

గత నవంబర్ నుండి మధుబాబు పేరు మీదున్న రికార్డులన్నింటిని వెంకట్ మార్చేశాడు. అప్పటి నుండి నెలవారి ఖర్చుల కింద కొంత మొత్తాన్ని ఇచ్చారు. జూన్ 15న విజయవాడలోని విజయా సూపర్ స్పెషాటిలీ ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేశారు. అప్పటి వరకూ అతనికి మొత్తం లక్షా పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. కొలుకున్న తర్వాత మధుబాబు మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ వెంకట్ ను అడగాడు. అప్పుడే వెంకట్ ప్లేట్ పిరాయించాడు. రక్త సంబంధీకుడుగానే కిడ్ని ఇచ్చావని నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ వెంకట్ ఎదురు తిరిగాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్నాడు.

ఎస్పీకి ఫిర్యాదు..

మధుబాబు ఇవాళ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. తన కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవడమే కాకుండా ఇంకొకరు ఈ విధంగా మోసపోకుండా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు. ఎస్పీ ఆదేశాను సారం నగరం పాలెం పీఎస్‌కు కిడ్నీ బాధితుడు మధుబాబు వెళ్లారు. మధుబాబు నుండి పోలీసులు వివరాలు సేకరించారు. మధుబాబు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కిడ్నీ రాకెట్‌పై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని తెలిపారు. కిడ్నీ రాకెట్ వెనకాల ఎవరున్నారో విచారణలో తెలుస్తుందన్నారు. అవసరమైతే స్పెషల్ టీం ద్వారా పూర్తి సమాచారం రాబడతామన్నారు.

Exit mobile version