Khushi Team in Yadadri: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఖుషీ టీం దర్శించుకున్నారు. ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.
దేవుడికి ధ్యాంక్స్ చెప్పుకోవడానికి..(Khushi Team in Yadadri)
ఈ సందర్బంగా ఖుషి సినిమాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ ధన్యవాదాలు తెలిపారు. దేవుడికి ధ్యాంక్స్ చెప్పుకోవడానికే వచ్చానని తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత దేవాలయంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.యాదాద్రికి 10 ఏళ్లకిందట వచ్చాను. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దీనిని అద్బుతంగా తీర్చి దిద్దారు. ఇండియాలోనే అద్బుతమైన గుడి. లోపల ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉందన్నారు. ప్రస్తుతానికి కుషి టీమ్ అందరి మొహాల్లో నవ్వులు కనిపిస్తున్నాయన్నారు. తన తదుపరి ప్రాజెక్టులు ఏమీ ఫైనల్ కాలేదన్నారు. ఈ ఏడాది టాలీవుడ్ కు బాగా కలిసివచ్చిందన్నారు.