Telangana Political News: కేంద్రం చేసిన కొత్త చట్టంలో కూడా మీటర్లకు మోటార్లను ఏర్పాటు చేయాలనే ఊసే లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. సవాల్ చేస్తున్నా… మోటార్లకు కేంద్రం మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ మీటర్లు పెడితే దానికి పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని, మీటర్లు పెట్టకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతావా? అంటూ సీఎం కేసీఆర్ ను సవాల్ చేసారు. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మెగిలిపేట గ్రామంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్… మీ కుటుంబ అవినీతికే మీటర్లు పెట్టినం.. మీ సంగతి చూస్తాం అని హెచ్చరించారు.వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాల్ చేశారు. నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకుకేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. రూ.60 వేల కోట్ల బకాయిలతో డిస్కంలను సంక్షోభంలోకి నెట్టిన ఘనత సీఎం కేసీఆర్ దేనంటూ ఆరోపణలు చేశారు. కరెంట్ ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.
కొండగట్టు బస్సు ప్రమాదంలో 50 మంది పేదలు చచ్చిపోయారు..అయినా ఒక్కసారి కూడా కేసీఆర్ పరామర్శించలేదువారి కుంటుబాలను ఆదుకోలేదు. కొండగట్టు ఘటనలో ఒక్క ఇంట్లో ఆరుగురు చనిపోయారు… అయినా నేటికీ ఆ బాధిత కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదు పెద్దపెద్దోళ్ళు చచ్చిపోతే మంచి బట్టలు వేసుకుని, సెంటు కొట్టుకుని, బొకేలు పట్టుకుని వెళ్తాడంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. 100 రోజుల్లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పేదోళ్ల పాపం వట్టిగా పోదు… కేసీఆర్ బిడ్డ జైలుకు పోతది.లిక్కర్, క్యాసినో దందాలో కేసీఆర్ బిడ్డ పెట్టుబడులు పెట్టింది. ఏ దందాలు చూసినా కేసీఆర్ బిడ్డ కవిత పేరే బయటికి వస్తోంది.నాన్నకు తగ్గ బిడ్డ దొరికిందని కేసీఆర్ సంతోషపడుతుండు.కేసీఆర్ కి ఇష్టమైన లిక్కర్ దందానే బిడ్డ కవిత చేసింది. అంటూ ఎద్దేవా చేసారు.
గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తానన్నహామీ ఏమైందని… గల్ఫ్ బాధితుల శవాలను కూడా తీసుకురాలేని అసమర్థులు అన్నారుసంజయ్. వేమువాడ రాజన్న, బాసర సరస్వతి ఆలయాలకు వందల కోట్ల మంజూరు హామీ ఏమైందన్నారు. మళ్లీ కొండగట్టు అంజన్న పేరుతో దేవుళ్లకే శఠగొపం పెడతున్నారంటూ కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు.