Site icon Prime9

KCR BRS Office: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

KCR

KCR

KCR BRS Office: దేశ రాజకీయాల్లో అపూర్వఘట్టానికి తెరలేచింది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి -బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌.. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నడిబొడ్డున సర్దార్‌ పటేల్‌ రోడ్డులో బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జేడీఎస్‌ నేత కుమారస్వామి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌తోపాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు.

రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో కేసీఆర్‌ పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మలతోపాటు వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర తేజ తదితరులు యాగ క్రతువులో భాగస్వామ్యులయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకొంటామని కేసీఆర్ ప్రకటించారు.ఈ దిశగా కేసీఆర్ వ్యూహారచన చేస్తున్నారు.

Exit mobile version