Kalvakuntla kavitha: అస్సాం వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేశారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న మొబైల్ ఫుడ్ కోర్ట్ వద్ద ఆగి మోమొలు తిన్నారు. స్ట్రీట్ ఫుడ్ ఎవరు వద్దంటారు అందులోనూ మోమొస్ లాంటి ప్రత్యేకమైన పదార్థాలు తినకుండా ఎలా ఉంటామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కామాఖ్యదేవి ఆలయం సందర్శన..(Kalvakuntla kavitha)
అసోంలోని గౌహతిలోని కామాఖ్యాదేవి ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం సందర్శించారు. ఆమెకు అర్చకులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు, దేశం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించి మళ్లీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. నాలుగైదు సంవత్సరాల క్రితం తాను కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించానని, ఇటీవల తిరిగి రావడం సంతోషంగా ఉందని కవిత తెలిపారు. భారతదేశం గొప్ప ఆధ్యాత్మికత కలిగిన దేశమని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఉన్నాయని ఆమె అన్నారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలకు ముఖ్యమైన పుణ్యక్షేత్రమైన కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందన్నారు.