Kaleswaram Project: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగించకుండా… కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేశారనే రికార్డులు పరిశీలిస్తున్నామని కాలేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ ఘోష్ అన్నారు. హైదరాబాద్ లో విలేకరులతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.
ఇంత ఖర్చు అవరసరమా? (Kaleswaram Project)
మూడు నెలల వరదనీటిని ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా అనే దిశగా విచారణ చేస్తున్నట్లు జస్టిస్ చంద్రఘోష్ తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల పై ఫైవ్ మెంబర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ గురించి కాళేశ్వరం కమిషన్ ఆరా తీస్తోంది. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని గత ప్రభుత్వాన్ని కమిషన్ ప్రశ్నించింది. 2015 ప్రాణహిత చేవెళ్లపై రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టును కమిషన్‌కు ఇవ్వాలని జస్టిస్ చంద్ర గోష్ ఆదేశించినట్లు చెప్పారు.