Site icon Prime9

Juda’s strike: జూడాల సమ్మె: రెండు వర్గాలుగా చీలిపోయిన జూనియర్ డాక్టర్లు.

Juda's strike

Juda's strike

Juda’s strike: తెలంగాణలో తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టిన జూనియర్ డాక్టర్లు రెండుగా చీలిపోయారు. నిన్న అర్ధరాత్రి వరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించగా.. ఉస్మానియా జూనియర్ డాక్టర్లు మాత్రం సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు.

గాంధీ ఆసుపత్రి vs ఉస్మానియా ఆసుపత్రి..(Juda’s strike)

హాస్టల్ ఫెసిలిటీ, కాకతీయ మెడికల్ రోడ్స్ కు సంబంధించి సమస్యలు పరిష్కారాన్నికి జీ ఓ ఈ రోజు ఇస్తాం అని ప్రభుత్వం హామీతో సమ్మె విరమిస్తున్నాం అని గాంధీ జూడాలు ప్రకటించగా.. ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ పైన క్లారిటీ రానిది సమ్మెను ఎలా విరమిస్తారు అని గాంధీ జూడాలను ఉస్మానియా జూడాలు నిలదీశారు. తాము సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు. 8 డిమాండ్స్ లో కేవలం రెండు అంశాలు పరిష్కరిస్తే సరిపోతుందా అని ఉస్మానియా జూడాలు ప్రశ్నించారు. ప్రభుత్వం తమ మధ్య చీలిక తెచ్చిందని ఉస్మానియా జూడాలు మండిపడుతున్నారు.

ఉస్మానియా మినహా …

ఉస్మానియా ఆసుపత్రిలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు బుధవారం నాడు చేపట్టిన నిరవధిక సమ్మెను తాత్కాలికంగా విరమించారు.మంగళవారం అర్థరాత్రి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఆరోగ్య శాఖ అధికారులతో జరిగిన చర్చల అనంతరం తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) సమ్మెను ప్రస్తుతానికి విరమించాలని    నిర్ణయించింది.టీ-జూడా నేతలు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ ఎన్ వాణి, ఇతర అధికారుల మధ్య మంగళవారం అర్థరాత్రి వరకు చర్చలు కొనసాగాయి.వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ వద్ద రోడ్డు మరమ్మతులు, కళాశాల బస్సులను ప్రవేశపెడతామని అధికారులు హామీ ఇచ్చారు.సకాలంలో స్టైఫండ్‌ పంపిణీకి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు, సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్‌లకు గౌరవ వేతనం, ఆసుపత్రుల్లో వైద్యులపై దాడులను అరికట్టేందుకు పోలీసు సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Exit mobile version